హైదరాబాద్ ,ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం వరంగల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ టౌన్షిప్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్దూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాకతీయ టెక్స్టైల్ టౌన్షిప్లో పీహెచ్సీని ఏర్పాటు చేయాలన్న ఆ జిల్లా కలెక్టర్ అభ్యర్థించారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం పీహెచ్సీని మంజూరు చేసింది. ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులకు కల్పించింది.