Saturday, November 23, 2024

Priayanka Gandhi Campaign – గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు…ప‌ట్ట‌ణాల‌లో ప‌బ్ లు, వైన్ షాపులు … ఇదే కెసిఆర్ ఘ‌న‌త

కాంగ్రెస్ రావాలి.. మార్పు రావాలి
నిరుద్యోగులకు ఉద్యోగాలు అందరికీ ఇళ్లు
రైతుల రుణాల మాఫీ మహిళలకు రక్షణ కోసం
తెలంగాణాలో మార్పు అవసరం
రాష్ర్టాన్ని బీఆర్ఎస్ భ్రష్టు పట్టించింది.. ప్రజలకు అన్యాయం చేసింది
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలందరికీ సంక్షేమం
ఖమ్మం రోడ్షోలో ప్రియాంక గాంధీ

రైతులు, మహిళలు, యువకులు శ్రమించి సాధించిన తెలంగాణాను పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ భష్టు పట్టించింది. ప్రజల కలను నిర్వీర్యం చేసింది, ప్రజల చేతిలో తెలంగాణాను గుంజుకుంది అని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు, యువతకు ఉపాధి లేదు. మహిళలకు రక్షణ లేదు, ఇలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమా? అందుకే కాంగ్రెస్ రావాలి, మార్సు రావాలి, అని ప్రియాంక నినదించారు. ఖమ్మంలో శనివారం ప్రియాంక గాంధీ రోడ్షో నిర్వహించారు.


ఈ రోడ్ షోకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతుల రుణాలు మాఫీ చేసే ప్రభుత్వం కావాలి, ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం కావాలి, మహిళలకు రక్షణ కల్పించే ప్రభుత్వం కావాలి, అందరికీ ఇళ్లు కట్టించే ప్రభుత్వం కావాలని, వాటిని కాంగ్రెస్ మాత్రమే సాధించగలదని ప్రియాంకా గాంధీ వివరించారు.


కాంగ్రెస్ పాలనలోని రాష్ర్టాల్లో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని, రాజస్థాన్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, కర్ణాటకలోనూ ఉద్యోగాల భర్తీకి కృషి జరుగుతోందన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, జాబ్ కేలండర్ విడుదల చేస్తామని, ఎన్ని ఉద్యోగలను భర్తీ చేస్తున్నాం, దరఖాస్తుల ఆఖరి తేదీ, పరీక్ష తేదీ, ఫలితాల తేదీ ముందుగానే వెల్లడి చేస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.
ఇక తెలంగాణ రాష్ర్టంలో రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావని, అప్పులు పేరుకు పోయాయని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని, భూమి లేని రైతులకు ఏటా రూ.12,000 ఇస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. ఇక రైతుల భూములను తెలంగాణ ప్రభుత్వం కొల్లగొడుతోందని, భూ మాఫియా చెలరేగిపోతోందని, ఈ అక్రమాలను అడ్డుకుంటామని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.


ఇక మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతం అని, పిల్లల ఆరోగ్యం, కుటుంబ సమస్యలతో తల్లడిల్లిపోతున్నారని, గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు, వైన్ షాపులు పెరిగిపోయాయని, మహిళల ఆర్థిక ఇబ్బందులు తీర్చేందుకు నెలకు రూ.2,500లు మహిళల ఖాతాల్లో జమ చేస్తామని, పిల్లల చదువుకు ప్రతి విద్యార్థికి రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తామని, ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాలను ప్రారంభిస్తామన్నారు. మహిళలకు రాష్టవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు. తెలంగాణాలో మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement