కరీంనగర్, ఆంధ్రప్రభ : కరీంనగర్ వైద్యుడు అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. ఆసియా టుడే ఇండియా ఆధ్వర్యంలో ప్రతి ఏడాది బహుకరిస్తున్న ప్రైడ్ ఆఫ్ ద నేషన్ అవార్డును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కరీంనగర్ కు చెందిన ప్రముఖ ల్యాప్రో స్కోపిక్ సర్జన్ చెట్టుమల్ల ప్రదీప్ కుమార్ కు శనివారం అందజేశారు.
మారుమూల ప్రాంత ప్రజలకు వైద్యుడు అందిస్తున్న సేవలను గవర్నర్ కొనియాడారు. రాబోయే రోజుల్లో మరింత నాణ్యమైన వైద్యాన్ని నిరుపేదలకు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. ల్యాప్రోస్కోపిక్ సర్జరీ సేవలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, లక్ష్మణ్ తో పాటు లైఫ్ లైన్ ఆస్పత్రి సీఈవో డాక్టర్ కంచన్ పాల్గొన్నారు.
- Advertisement -