భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జైలర్ యడారి రామయ్యను ప్రెసిడెంట్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డు వరించింది. యడారి రామయ్య (జైలర్) డిప్యూటీ జైలర్‌గా 1999లో ఉద్యోగం పొందారు. రాజమండ్రి సెంట్రల్ జైలు, చర్లపల్లి సెంట్రల్ జైలు, విజయవాడ జిల్లా జైలులో విధులు నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రిజన్ హెడ్ క్వార్టర్స్‌లో డ్యూటీ చేస్తున్నారు.
కాకతీయ యూనివర్సిటీలో చదివిన ఆయన డిగ్రీలో 4వ ర్యాంక్ పొందారు. ఇక.. పీజీ (ఎకనామిక్స్) ఓయూలో పూర్తి చేశారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగారు. ఈసందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జైలర్ రామయ్యను అభినందించారు.
ప్రెసిడెంట్ మెడల్ పురస్కారం అందుకుంటున్న సందర్భంగా ఆయన స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని రామంతారం గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రిజన్స్ డీజీ సౌమ్య మిశ్రా, హోం సెక్రెటరీ డాక్టర్ జితేందర్‌తో పాటు ఐజీలు, డీఐజీలు ఆయనకు అభినందనలు తెలిపారు.