Thursday, November 21, 2024

నేడు రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము రాక – న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు..

హైద‌రాబాద్ – రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు నగరానికి రానున్నారు.. రెండు రోజుల పాటు ఆమె ఇక్క‌డ బ‌స చేయ‌నున్నారు.. దీంతో శుక్ర, శనివారాల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈరోజు సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొన‌సాగుతాయి..సికింద్రాబాద్‌ నుంచి బేగంపేట మీదుగా అమీర్‌పేట, మెహదీపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సులను ఈ మార్గంలో కాకుండా అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ మీదుగా మళ్లిస్తారు. రాజ్‌భవన్‌ రోడ్డు, మోనప్ప జంక్షన్‌, వివి విగ్రహం రహదారులను ఇరువైపులా మూసివేశారు. పంజాగుట్ట రాజ్‌భవన్‌ క్వార్టర్స్‌ రోడ్డులో వాహనాలకు అనుమతి లేదు. సీటీఓ జంక్షన్‌, మినిస్టర్‌ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను రసూల్‌పర జంక్షన్‌లో కొంతసేపు నిలిపివేస్తారు. బేగంపేట విమానాశ్రయం మీదుగా పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్ మీదుగా వచ్చే వాహనాలు ప్రకాష్ నగర్ టి జంక్షన్‌లో కొంతసేపు నిలిచిపోతాయి. ఆయా మార్గాల్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.

ఇక 17న ఉదయం 6 నుంచి 8 గంటల వరకు. CTO జంక్షన్, PNB ఫ్లైఓవర్, జంక్షన్, HPS స్కూల్ అవుట్ గేట్, బేగంపేట్ ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్, మోనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్ రోడ్, MM. టీఎస్, వీవీ స్టాట్యూ జంక్షన్, పంజాగుట్ట జంక్షన్, ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. వాహ‌న‌దారులు ఈ ఆంక్ష‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌త్యామ్నాయ మార్గాల‌లో ప‌య‌నించాల‌ని ట్రాఫిక్ పోలీసులు సూచించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement