హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.శనివారం ఉదయం జరిగిన ఈ పరేడ్‌కు తొలిసారి రివ్యూయింగ్ ఆఫీసర్‌గా ద్రౌపది ముర్ము పాల్గోన్నారు.. అనంతరం గ్రాడ్యుయేట్స్ నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొనందుకు సంతోషంగా ఉందని అన్నారు. భారతీయ వైమానిక దళం అన్ని శాఖల్లోనూ మహిళా ఆఫీసర్లను రిక్రూట్ చేయడం సంతోషకరమన్నారు. మహిళా ఫైటర్ పైలెట్ల సంఖ్య భవిష్యత్తులో మరింత పెరగనున్నట్లు ఆమె వెల్లడించారు. ఏప్రిల్‌లో తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్‌లో విహరించినట్లు ఆమె తెలిపారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆ జెట్‌లో బ్రహ్మపుత్రి, తేజ్‌పూర్ లోయల్లో విహరించానని, హిమాలయాల అద్భుతాలను వీక్షించినట్లు ఆమె తెలిపారు. సముద్ర మట్టానికి రెండు కిలోమీటర్ల ఎత్తులో దాదాపు గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ఎగరడం గొప్ప అనుభూతిని మిగిల్చినట్లు ముర్ము తెలిపారు. సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్‌లో దాదాపు 30 నిమిషాల పాటు విహరించానని, ఆ జెట్ నుంచి బ్రహ్మపుత్ర, తేజ్‌పూర్ లోయల్లో విహరించానని, హిమాలయాల అద్భుతాలను వీక్షించినట్లు ఆమె తెలిపారు. . భవిష్యత్తు యుద్ధాలను దృష్టిలో పెట్టుకుని వైమానిక దళం ముందుకు సాగుతున్నట్లు ఆమె తెలిపారు.
ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో మొత్తం 119 ఫ్లయింగ్ ఎయిర్ ట్రైనీలు, 75 మంది గ్రౌండ్ డ్యూటీ ట్రైనీ క్యాడెట్లు శిక్షణ పొందారు. మరో 8 మంది క్యాడెట్లు ప్రత్యేక శిక్షణ పూర్తిచేసుకున్నారు. వారిలో ఇద్దురు వియత్నాం దేశానికి చెందిన క్యాడెట్లు కాగా, మిగతా ఆరుగురు నేవీ, కోస్ట్‌గార్డ్‌కు చెందినవారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్ పాల్గొన్నారు.