నగరంలోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డారు. నడిరోడ్డుపై ప్రియురాలి గొంతు కోసేశాడు ప్రేమోన్మాది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని గాయపడిన యువతిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మధుసూధన్ రెడ్డి అనే యువకుడు, యువతి కలిసి అమీర్‌పేట్‌లోని ఓ సంస్థలో ఐటీ శిక్షణ తీసుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమై ఇద్దరు ఆ తరువాత ప్రేమలో పడ్డారు. అయితే మద్యం ఇతర వ్యసనాలకు బానిసవడంతో మధుసూదన్ రెడ్డిని యువతి దూరం పెట్టేసింది. దీంతో యువతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన యువకుడు.. తనను ప్రేమించి దూరం పెడుతుందనే కోపంతో బ్లేడ్‌తో దాడి చేసి గాయపరిచాడు. బ్లేడ్‌తో దాడి చేయడంతో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే యువకుడు మధుసూదన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం యువతికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.