Sunday, November 24, 2024

నెలలు నిండకముందే డెలివరీ.. తల్లీబిడ్డలు సేఫ్…

నెలలు నిండక ముందే‌ ప్రసవించిన శిశివును‌ అలాగే తల్లి ప్రాణాలను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడి తల్లిని‌, శిశువును కుటుంబ సభ్యులకు మల్లారెడ్డి నారాయణ వైద్య బృందం అప్పగించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి, వైద్య బృందం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ… సూరారం కాలనీకి చెందిన దంపతులు పరమేష్ చౌదరి, విమల చౌదరి మార్చి 7వ తేదీ మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రికి గర్భానికి సంబంధించిన వైద్య పరీక్షలకు రావడంతో విమల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఆమెకు ఇంట్యూబేషన్ చేసి వెంటిలేటర్‌పై ఉంచినప్పుడు చికిత్సకు బాగా స్పందించిందన్నారు. ఆమె మొత్తం ఆసుపత్రిలో ఉన్న సమయంలో బేబీ విమల రెండుసార్లు ఇంట్యూబేట్ చేయబడిందన్నారు. మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న 3వ స్థాయి NICU ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా మరింత వైద్య సంరక్షణ నిచ్చే తమ నిపుణులైన నియోనాటల్ కేర్ టీమ్ అప్రమత్తమైన పర్యవేక్షణలో, బేబీ విమల బరువు పెరగడమే కాకుండా (కేవలం 70 రోజుల్లో 710 గ్రాములు!) అత్యంత కీలకమైన అనారోగ్యాలను అధిగమించిందన్నారు.


మల్లారెడ్డి నారాయణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్‌లోని నియోనాటాలజిస్ట్ డాక్టర్ దీపా డి.శెట్టి మాట్లాడుతూ… తాము ఇచ్చే ప్రత్యేకమైన పోషకాహారం, నిరంతర పర్యవేక్షణ లో శిశువు సరైన పెరుగుదల, శ్రేయస్సును నిర్ధారించడానికి తగిన వైద్య బృందం కలిగి ఉన్నందున ఖచ్చితమైన చికిత్స ప్రణాళికను ఉపయోగించాము. ఇంత తక్కువ వ్యవధిలో బేబీ విమల సాధించిన పురోగతికి తాము చాలా సంతోషిస్తున్నామన్నారు. ఆమె నిరంతర ఎదుగుదల అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ కె.రాజశేఖర్ మాట్లాడుతూ… తాము సాధించిన ఈ విజయానికి తాము తమ బృందం నిజంగా చాలా కష్టపడ్డామన్నారు. ఇప్పుడు బేబీ విమలలో ఎటువంటి అనారోగ్య అసాధారణతలు లేవని నమ్ముతున్నామన్నారు. బేబీ విమల సాధారణ జీవితాన్ని గడపగలదని తాము ఆశిస్తున్నామన్నారు. పాప విమల తల్లిదండ్రుల సంతోషకరమైన ముఖాలను చూడటం తమకు చాలా సంతృప్తినిచ్చే విషయమన్నారు. తాము ప్రపంచ స్థాయి నియోనాటల్ కేర్, సేవలను అందించడానికి తమ నిబద్ధతతో కొనసాగుతామన్నారు. సుసాధ్యం చేసిన మల్లారెడ్డి నారాయణ వైద్యులను శిశివు కుటుంబ సభ్యులు అభినందించారు. ఈ సమావేశంలో వైద్యులు డా.కే రాజశేఖర్ రావు, ఎంబీబీఎస్, ఎండీ (పీడియాట్రిక్స్) డా.దీపా దరణప్ప, నియోనాటాలజీ ఫెలోషిప్ (పీడియాట్రిక్స్) ఎండీ, డా.ఎల్.ప్రణతిరెడ్డి, ఎంబీబీఎస్, ఎంఎస్ (ప్రసూతి అండ్ గైనకాలజీ, ఐవీఎఫ్ స్పెషలిస్ట్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కన్సల్టెంట్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement