హైదరాబాద్: గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్యతో ముడిపెడుతూ ట్విటర్ వేదికగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. ప్రవళిక ఆత్మహత్య ఎంతో బాధ కలిగించిందని.. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకూ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేసిన వాళ్లే ఓదార్చుతున్నట్లు ఉంది మీ వ్యవహార శైలి. రేవంత్ రెడ్డి ఆవేదన బూటకం.. కాంగ్రెస్ ఆందోళన నాటకం” అని కౌంటర్ ఇచ్చారు కవిత..
”బతుకమ్మ చేస్తాం.. బాధనూ పంచుకుంటాం. బతుకమ్మ పండుగను కించపరిచేలా మాట్లాడటం కాంగ్రెస్‌కు మాత్రమే సాధ్యం. తెలంగాణ ఆడబిడ్డ ఆత్మహత్యపై రాజకీయం చేయడం మీ విధానమా? నోటిఫికేషన్లకు మోకాలడ్డుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ. నోటిఫికేషన్లను అడ్డుకోవడానికి కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేసింది వాస్తవం కాదా? కాంగ్రెస్ కుట్రలను బద్దలుకొట్టి లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని శ్రీధర్ బాబు అసెంబ్లీలో డిమాండ్ చేయలేదా?వాయిదా వేయాలని రేవంత్ రెడ్డి ట్వీట్ చేయలేదా? శవాల మీద పేలాలు ఏరుకోవడం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య. హత్య చేసిన వాళ్లే ఓదార్చుతున్నట్లు ఉంది మీ వ్యవహార శైలి. రేవంత్ రెడ్డి ఆవేదన బూటకం.. కాంగ్రెస్ ఆందోళన నాటకం” అని కవిత వ్యాఖ్యానించారు.