తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఉన్న బీజేపీ.. దూకుడుగా వ్యవహారిస్తోంది. టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్న బండి సంజయ్.. ప్రజా సంగ్రామ యాత్ర మందుకు సాగుతోంది. ఇప్పటికే పలువురు జాతీయ స్థాయి నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో సాగుతున్న బండి పాదయత్రలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార టీఆర్ఎస్ సర్కార్ పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ గడ్డ హిందువుల అడ్డా అని ఇక్కడ పచ్చ జెండాకు స్థానం లేదన్నారు. తెలంగాణలో ప్రజా పాలన నడవడం లేదన్న ఆయన.. కేవలం కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు. సీఎం పీఠం ఎక్కగానే కేసీఆర్ హామీలను మర్చిపోయారని ఆరోపించారు. గడిచిన ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజల్ని మభ్యపెడుతోన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాల పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రాలకు నిధులు పెంచారని, తెలంగాణలో హైవేల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారని చెప్పారు. రాష్ట్రంలో వచ్చేది ప్రభుత్వం బీజేపీదేనని జోస్యం చెప్పారు. రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో జరిగేది ఉద్యమమేనని ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. నిరుద్యోగులకు డీఎస్సీ లేదు, నోటిఫికేషన్లు లేవు, నిరుద్యోగ భృతి లేనే లేదన్నారు. ఇచ్చిన హామీలన్నీ మరిచి గడీల పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు లక్షల తొంబై ఒక వేల ఇళ్లు పీఎం అవాస్ యోజన కింద మోడీ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కామారెడ్డి పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎందుకు ఇవ్వలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి. బాగా బలిసినోడు, బలుపెక్కినోడే డ్రగ్స్ తీసుకుంటారు. డ్రగ్స్ ఛాలెంజ్ పేరుతో టీఆర్ఎస్ , కాంగ్రెస్ లు కలిసి నాటకాలు ఆడుతూ.. ‘ప్రజా సంగ్రామ యాత్ర’ నుంచి ప్రజల ధ్రష్టి మరల్చేందుకు కుట్రలు పన్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రజలను వంచిస్తున్నాడని, ప్రజల కష్టాలను, కన్నీళ్లను తుడిచి వేయడానికి, వాళ్ళకి న్యాయం చేయడానికే భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిందన్నారు. కామారెడ్డి జిల్లాలో ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదు. ఎంఐఎం నా కొడుకులు ఇక్కడ 17 మందిపై దాడి చేశారు… ఈ నా కొడుకులను ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదు.