హుజూరాబాద్ – ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం అమలు తీరును డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ నేడు పరిశీలించనున్నారు.. దళితబందు లబ్దిదారులతో ఆయన ముచ్చటించనున్నారు.. హుజురాబాద్లో దళితబందు లబ్దిదారులను కలిసి వారి అనుభవాలను, దళితబందు ద్వారా వారి జీవితాల్లో వచ్చిన సమూల మార్పుల గురించి ప్రకాష్ అంబేద్కర్ తెలుసుకోనున్నారు. మంత్రి గంగుల స్వయంగా దగ్గరుండి ప్రకాష్ అంబేద్కర్ ని హుజురాబాద్ దళితబందు లబ్దీదారుల వద్దకు తీసుకొని వెళ్లేందుకు బేగంపేట విమానాశ్రయం నుండి హుజూరాబాద్ కు ప్రత్యేక చాపర్ లో బయలు దేరారు.. ఆయన వెంట మంత్రి గంగుల కమలాకర్ తో పాటు విప్ బాల్క సుమన్ తదితరులు ఉన్నారు..ఇది ఇలా ఉంటే భారతరత్న, బాబాసాహెబ్ 125 అడుగుల విగ్రహావిష్కరణకు సర్వం సిద్దమైంది, సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాబాసాహెబ్ విగ్రహావిష్కరణ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు గత రాత్రి హైదరాబాద్ విచ్చేసిన బాబాసాహెబ్ మునిమనుమడు ప్రకాష్ అంబేద్కర్ కు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఘనంగా స్వాగతం పలికారు.. ఆయనకు దళితబందు జ్ణాపికను అందజేసారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement