కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ,జమ్మికుంటలో దళిబంధు యూనిట్లను అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేడ్కర్ నేడు పరిశీలించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళిత బంధు పథకాలు పకడ్బందీగా అమలు చేస్తే మరింత మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. చదువుతో పాటు ఉపాధి కల్పించే పథకాలు అమలు చేస్తేనే దళితుల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు.బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటి కౌంటర్ గ్యారంటీ అడగడమే ఇబ్బందులను తెచ్చిపెడుతుందన్నారు. 70 ఏళ్లుగా జీవన ప్రమాణాలు మెరుగు పడక పోవడం వల్ల దళితులు ఇబ్బంది పడ్డారన్నారు. దళిత బంధు పథకాలు ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తే బాగుంటుందన్నారు. ఈ పథకం దేశానికే ఆదర్శం కావాలని కోరుకుంటున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, విప్ లు బాల్క సుమన్, పాడి కౌశిక్ రెడ్డి లు పాల్గొన్నారు
Advertisement
తాజా వార్తలు
Advertisement