ప్రజాభవన్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా ర్యాష్ డ్రైవింగ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ అని నిర్ధారించారు. ప్రధాన నిందితుడిగా సోహైల్‌ను చేర్చటమే కాకుండా.. అతనిపై 17 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ.. పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గరావును సస్పెండ్ చేశారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సోహెల్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని దుర్గారావుపై అభియోగాలు ఉన్నాయి. బేగంపేటలోని ప్రజా భవన్ వద్ద అత్యంత వేగంతో కారు నడుపుతూ అక్కడి వారిని షకీల్ తనయుడు సోహెల్ ఢీకొట్టారని ఆరోపణలు వచ్చాయి. 17 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. డ్రైవింగ్ సీటులో ఉన్న సోహెల్‌కు బదులు డ్రైవర్ పేరును కేసులో చేర్చడంతోపాటు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇన్‌స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేశారు. ఇప్పటికే దుర్గారావు వ్యవహారంపై వెస్ట్ జోన్ డీసీపీ పూర్తిస్థాయిలో విచారణ జరిపినట్లు తెలుస్తోంది. కాగా, బీపీ డౌన్ కావడంతో ఇప్పటికే దుర్గారావు దవాఖానలో చేరారు.