కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవే తనను అందుకుంటుందని, తాను పదవుల రేసులో లేనని అన్నారు. ముఖ్యమంత్రి పదవి రేసులో తాను కూడా ఉన్నానంటూ ఆయన సంకేతాలిచ్చారు. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జానారెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాబట్టే ఎక్కువ మంది పార్టీలోకి వస్తున్నారని జానారెడ్డి చెప్పారు.
ఈ సందర్భంగా ఒకప్పుడు ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు కాలేదా? అవసరమైతే తన కొడుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడని, తాను ఎమ్మెల్యే అవుతానని ఆయన చెప్పొకొచ్చారు. అయితే. ఈసారి జానారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన కుమారుడు జయవీర్ నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను సీఎం రేసులో ఉన్నానని ఆయన చెప్పడం ఇప్పుడు పార్టీలోనూ, రాజకీయవర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.