Tuesday, November 19, 2024

NZB: లంచం తీసుకున్న కేసులో.. విద్యుత్ శాఖ ఉద్యోగికి కఠిన కారాగార శిక్ష

రూ.10 వేల జరిమానా
సెకండ్ అడిషనల్ స్పెషల్ జడ్జ్ ఏ.సి.బి. కోర్టు తీర్పు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, ఆగస్టు 13(ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో లంచం తీసుకున్న కేసులో విద్యుత్ శాఖ ఉద్యోగి మచ్చ సదాశివ్(ఏఏఈ) కు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ సెకండ్ అడిషనల్ స్పెషల్ జడ్జ్ ఏ.సి.బి. కోర్టు, నాంపల్లి, హైదరాబాద్ న్యాయమూర్తి మహమ్మద్ అఫ్రోజ్ అక్తర్ తీర్పు ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం… మాకూరు మండలంలోని మదనపల్లి గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి, బంధువుల వ్యవసాయ పొలాలు ఉన్నాయి. కొత్త ట్రాన్స్ ఫార్మర్, కొత్త కనెక్షన్లను ఏర్పాటు చేయడం కోసం విద్యుత్ శాఖలో (ఏఏఈ)మచ్చ సదాశివ్ ని సంప్రదించగా సదరు అధికారి లంచం డిమాండ్ చేశారు.

కానీ ఫిర్యాదుదారుడైన కేసరి శ్రీనివాస్ రెడ్డి విద్యుత్ అధికారికి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుడు నుంచి రూ.3వేలు లంచం తీసుకుంటుండగా నిజామాబాద్ ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి మచ్చ సదాశివ్ ను పట్టుకున్నారు. ఈ కేసులో ఏసీబీ తరపున లక్ష్మి మనో జ్ఞ, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యుటర్ హైదరాబాద్ తన వాదనలు వినిపించగా, ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు నాంపల్లి, హైదరాబాద్ ప్రత్యేక న్యాయమూర్తి మహమ్మద్ అఫ్రోజ్ అక్తర్ విద్యుత్ అధికారికి ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష, రూ.10,000ల‌ జరిమానాను విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ శిక్షను ఏకకాలంలో వర్తించును. ఒక వేళ జరిమానా డబ్బులు చెల్లించని యెడల మూడు నెలలు అదనపు సాధారణ ఖారాగార శిక్ష అనుభ‌వించవలసి ఉంటుందని తీర్పు వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement