Sunday, November 3, 2024

వివాదంలో పోస్ట‌ర్ – మ‌హిషాసురుడిగా మోడీ – దుర్గాదేవిగా మ‌మ‌తా బెన‌ర్జీ

ఇప్పుడో పోస్ట‌ర్ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. మ‌హిషాసురుడిగా ప్ర‌ధాని మోడీ, ఆయ‌న్ని సంహ‌రించే దుర్గాదేవిగా మ‌మ‌తా బెన‌ర్జీ ఉన్న పోస్ట‌ర్ సంచ‌ల‌నంగా మారింది. పశ్చిమబెంగాల్ లో ఇప్పుడా పోస్టర్ వివాదానికి కేంద్ర బిందువైంది. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా మదనాపూర్ జిల్లాలో తృణమూల్ పార్టీకి చెందిన అభ్యర్థి అనిమా సాహా ఈ పోస్టర్ ను ఏర్పాటు చేశారు.ఈ పోస్టర్ లో మోడీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానూ మహిషాసురుడిగా చూపించారు. ఇతర పార్టీలను మేకలుగా చూపిస్తూ బలి పశువులుగా తెలియ‌జేశారు. ఎవరైనా వారికి ఓటేస్తే.. వారిని బలిస్తామంటూ కింద నోట్ కూడా పెట్టారు. దీనిపై స్థానిక బీజేపీ నేత విపుల్ ఆచార్య మండిపడ్డారు. సనాతన ధర్మానికి, ప్రధాని మోడీ, అమిత్ షాకి తీవ్ర అవమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు. అయితే ఆ పోస్టర్ ఎలా వచ్చిందన్న విషయం కూడా తనకు తెలియదని అనిమా సాహా స్ప‌ష్టం చేశారు. అలాంటి పోస్టర్లను తానే పెట్టనివ్వనని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement