ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
కేసులో ఇరికించారన్న జానీ మాస్టర్
వారందరిపై తగిన బుద్ది చెబుతానంటూ శపథం
హైదరాబాద్ – లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను శుక్రవారం నార్సింగి పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారించిన న్యాయమూర్తి 14 రోజులు జానీ మాస్టర్ కు విధించారు.. దీంతో అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు.
కాగా, కోర్టుకు హాజరుపరిచిన సమయంలో జానీ మాస్టర్ మీడియాతో మాట్లాడుతూ, కావాలనే కుట్రపూరితంగా తనను ఇరికించారని ఆరోపించారు. . కడిగిన ముత్యంలా నిజాయితీగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనను టార్గెట్ చేసి.. ఇబ్బందులకు గురిచేసిన ఎవరినీ వదలిపెట్టబోనని.. అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
కాగా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటలకు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నగరంలోని రహస్య ప్రదేశంలో అతడిని విచారించిన అనంతరం ఉప్పరపల్లి కోర్టుల్లో ఆయన్ను హాజరుపరిచారు.