Saturday, September 7, 2024

Polycet తెలంగాణ పాలిసెట్‌ రిజ‌ల్ట్స్‌ విడుదల

తెలంగాణ పాలిసెట్‌లో 84.20 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. హైదరాబాద్‌లోని సాంకేతిక విద్యా భవన్‌లో పాలిసెట్‌ ఫలితాలను ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. మే 24న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 92,808 మంది దరఖాస్తు చేసుకోగా 82,809 మంది హాజరయ్యారు. వీరిలో 69,728 మంది (84.20 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 46,319 మంది బాలురు పరీక్షకు హాజరవగా 37,269 మంది (80.47 శాతం), 36,496 మంది బాలికల్లో 32,459 మంది (88.94 శాతం) అర్హత సాధించారు. ఇక ఎంపీసీ విభాగంలో 84.20 శాతం, ఎమ్ బైపీసీలో 82.48 శాతం ఉత్తీర్ణత నమోదయింది. పరీక్ష రాసిన విద్యార్థులు https://sbtet.tela ngana.gov.in వెబ్‌సైట్‌లో తమ ఫలితాలు చూసుకోవచ్చు. ఇందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫిషరీస్‌, హార్టికల్చర్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రశేశాలు కల్పిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement