Monday, November 25, 2024

Pollution Control Board – భ‌యం వ‌ద్దు … సాధార‌ణ స్థాయిలోనే వాయి కాలుష్యం…

ఆంధ్ర‌ప్ర‌భ , హైద‌రాబాద్ : హైద‌రాబాద్ ట్రైసిటీస్‌లో వాయు కాలుష్యం సాధార‌ణ స్థాయిలోనే ఉంద‌ని, ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన‌ప‌నిలేద‌ని తెలంగాణ కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి తెలిపింది.. సీజ‌న్ ల‌లో వాయి కాలుష్యంలో కొన్ని మార్పులు ఉంటాయ‌ని,ఇదే స‌హ‌జ‌మ‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300కు చేరింద‌నే సోష‌ల్ మీడియాలో ప్ర‌చారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని తెలిపింది. వాస్త‌వ వాయి కాలుష్యాన్ని తెలుసుకునేందుకు SAMMERR.APP ని ,చూడాలని కోరింది.

ఈ వాయికాల‌ష్యంపై ప్ర‌జ‌ల‌లో ఏర్ప‌డిన అపోహాల‌ను తొల‌గించేందుకు ఒక ప్ర‌క‌ట‌న‌ను కాలుష్య నియంత్రణ మండ‌లి నేడు ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేసింది..


ఆ ప్ర‌క‌ట‌న సారాంశం …. య‌ధాత‌థంగా మీకోసం …

హైద‌రాబాద్‌లో గాలి నాణ్య‌త క్షీణించ‌డం లేద‌ని, దీనిపై ఎవ‌రూ ఆందోళ‌న చెంద వ‌ద్ద‌ని తెలంగాణ కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. హైద‌రాబాద్‌తోపాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో గాలి నాణ్య‌త‌ను 14 ప్ర‌దేశాల్లో నిరంతర పరిసర ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ల ద్వారా ఆటోమేటిక్ గా లెక్కిస్తున్నామ‌ని పేర్కొంది. మాన్యువల్‌గా 16 ప్రదేశాలలో వాయు నాణ్యత పర్యవేక్షిస్తున్న‌ట్లు తెలిపింది. హైదరాబాద్ కి సంబంధించిన ఏక్యూఐ ని తెలుసుకోవడానికి, దాంతో బాటు, నిర్ణీత ధృవీకరణ తర్వాత ఇచ్చే ఏక్యూఐ పై సందేశాలకోసం స‌మీర్ (ఎస్ఏఎంఈఈఆర్‌) యాప్‌ని ఉపయోగించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సూచించింది.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఆధారంగా గణించబడుతుంది, అయితే చాలా యాప్‌లు యూరప్, అమెరికా ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఆధారంగా ఏక్యూఐ ని గణిస్తున్నాయి. అది మనకు వర్తించదు. ఇది అధిక ఏక్యూఐ ని సూచిస్తుందని గమనించవచ్చు.


ఏక్యూఐ పరిసర గాలిలో పర్యవేక్షించే 8 అంశాలలో 3 అత్యధిక కాలుష్య అంశాల సాంద్రతను ప్రతిబింబిస్తుంది. ఈ సూచిక పౌరులు అర్థం చేసుకోవడానికి ఎటువంటి యూనిట్లు లేని సంఖ్య మాత్రమే. ఈ సమాచారంతో గందరగోళం చెందకూడదు. గత 3 రోజులలో హైదరాబాద్ ఏక్యూఐ , అంటే నవంబర్ 22, 23 మరియు 24వ తేదీల్లో మధ్యస్థంగా ఉంది, ఈ ఏక్యూఐ వరుసగా 120, 123 మరియు 123గా ఉంది. హైదరాబాద్‌లోని వాయు నాణ్యత సూచిక సాధారణంగా మంచి నుండి మోడరేట్ అంటే <200 పరిధిలో ఉంటుంది. ఏక్యూఐ వర్షాకాలంలో బాగుంటుంది, శీతాకాలంలో మధ్యస్థంగా ఉంటుంది. రుతువుల్ని బట్టి మారుతుంది.

  • సీపీసీబీ యొక్క “ స‌మీర్ (ఎస్ఏఎంఈఈఆర్‌) యాప్” అనేది ప్రభుత్వ అధికారిక యాప్, ఇది నగరాల ఏక్యూఐ తో బాటు నిరంతర పరిసర వాయు నాణ్యతా పర్యవేక్షణ స్టేషన్‌ల ఆధారంగా వ్యక్తిగత స్టేషన్‌లకు అందిస్తుంది.
  • గాలి నాణ్యతను మెరుగుపరిచే కార్యాచరణ ప్రణాళిక హైదరాబాద్‌లో అమలులో ఉంది, దీని కారణంగా పీఎం10 మరియు పీఎం2.5 సాంద్రతలు 2019 నుండి 2023 వరకు వరుసగా 97 నుండి 81 µg/m3, 40 నుండి 36 µg/m3కి తగ్గాయి.
    అందువల్ల, పౌరులు హైదరాబాద్ కి సంబంధించిన AQIని తెలుసుకోవడానికి, దాంతో బాటు, నిర్ణీత ధృవీకరణ తర్వాత ఇచ్చే AQIపై సందేశాలకోసం SAMEER యాప్‌ని ఉపయోగించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సూచించింది.
Advertisement

తాజా వార్తలు

Advertisement