పంచ్ డైలాగ్ల ప్రభావం జనాలపై ఎంత ఉందో తెలియదు కానీ, సినిమాల ప్రభావం మాత్రం రాజకీయ పార్టీలపై బాగా ఉంది. సినిమా నటులు రాజకీయాల్లోనూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఈ మధ్య అసందర్భంగా కొంత మంది మహిళా నటిల పేర్లు రాజకీయాల్లో తరుచూ వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో హీరోయిర్ రకుల్, నిన్న ముమైత్ ఖాన్ తాజాగా శ్రీరెడ్డి. ఈ ముగ్గురికి తెలంగాణ రాజకీయాలతో సంబంధం లేదు. కానీ, వీరి పేర్లను మాత్రం రాజకీయ పార్టీలు తరచూ ప్రస్తావిస్తున్నాయి. దీంతో తెలంగాణ పాలిటిక్స్ లో వీరి పేర్లు మార్మోగుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డిపై ఆ పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ముమైత్ ఖాన్‌తో పోలుస్తూ మాట్లాడిన కౌశిక్ రెడ్డిని శ్రీరెడ్డితో పోల్చారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి ఘాటు వ్యాఖ్యలే చేశారు. సిగ్గు, శరం లేకుండా కౌశిక్ మాట్లాడుతున్నాడంటూ ఫైర్ అయ్యారు.‘”కేసీఆర్ ఇచ్చే స్క్రిప్టు చదివే నీకు సిగ్గు ఉండాలి. ముమైత్ ఖాన్‌తో పోలుస్తావా బిడ్డా.. నువ్వు శ్రీరెడ్డిలా వ్యవహరిస్తున్నావు. నువ్వు, నీ అన్న కోట్లాది రూపాయాలు తీసుకొని జీహెచ్ఎంసీ, జనరల్ ఎలక్షన్లలో టికెట్లు అమ్ముకున్నారు” అంటూ ఆరోపించారు. కాగా, గతంలో ఎప్పుడు లేని విధం ఈ మధ్య రాజకీయ పార్టీలు ఇలా సినీ తారల పేర్లను రాజకీయాల్లోకి తీసుకువడం హాట్ టాపిక్ గా మారింది.