Friday, November 22, 2024

డికె అరుణ నిర్మ‌ల్ ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకున్న పోలీసులు

ఇందల్ వాయి ప్రభ న్యూస్ – బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు.మాజీ మంత్రి డీకే అరుణ వాహనాన్ని ఇందల్ వాయి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి నిర్మల్ జిల్లాలో శాంతియుతంగా దీక్షా చేస్తున్న‌ హరిశ్వర్ రెడ్డీ ఆరోగ్యం క్షీణంచడంతో పరామర్శించడానికి వెళ్తున్న ఆమెను సుమారు గంటకు పైగా అడ్డుకొని అనంతరం పోలీస్ బందోబస్తు నడుమ డీకే అరుణ ను తీసుకెళ్లారు. ఆమె వెళ్తున్న‌ వాహనాన్ని పోలీసులు వెళ్లకుండా ముందు… వెనుక పోలీస్ వాహనాలు పెట్టీ ఎ అడ్డుకోవడంతో అమె వాహనంలోనే కూర్చోని తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.

అనంతరం అక్కడే స్థానిక విలేఖరలతో మాట్లాడుతూ పోలీసుల తీరు పై విమర్శలు చేస్తూ ప్రభుత్వ ఏజెంట్ లాగా పోలీసులు వ్యవహరించడం దారుణమన్నారు.ఎలాంటి కాన్వాయ్ లేకుండా పరామర్శ చేయడానికి వెళ్తున్నా తన ప‌ట్ల‌ పోలీసులు రౌడీల్లా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు బలవంతంగా తనను తీసుకెళ్తున్నారని ఎక్కడి వరకు తీసుకెళ్తారో ఏమో అంతు చిక్కడం లేదని అవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ కు తీసుకెళ్తార లేక మధ్యలోనే అరెస్టు చేస్తారో తెలియడం లేదని డీకే అరుణ ఆవేదన వెలిబుచ్చారు .ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోలిసులు తొత్తులుగా వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో కేసిఆర్ సర్కారు కు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు. .ఆమె వెంట నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.బీజేపీ నేతలు.కార్యకర్తలు. అభిమానులు ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement