Friday, November 22, 2024

150 కిలోల గంజాయి పట్టివేత.. రెండు కార్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

జనగామ (ప్రభన్యూస్ ప్రతినిధి) : నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తులను సోమవారం సాయంత్రం జనగామ జిల్లా లింగాలఘన్ పూర్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 150 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు సంబంధించి స్థానిక లింగాలఘన్ పూర్ ఎస్ఐ రఘుపతికి పక్కా సమాచారం అందింది. ఆమేరకు వెంటనే స్థానిక పోలీస్ సిబ్బందితో కలిసి సోమవారం సాయంత్రం రంగంలోకి దిగారు.

మండలంలోని పటేల్ గూడెం రహదారి పై వాహనాల తనిఖీ చేపట్టారు. ఒడిశా రాష్ట్రం నుంచి సరుకుతో వస్తున్న రెండు కార్ల‌తో పాటు నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..అనంతరం తహసీల్దార్ ముందు ప్ర‌వేశ‌పెట్టి అన్నింటిని సిజ్ చేశారు.. పట్టుబడిన కారులో ఒక్కక్కటి రెండు కిలోల బరువు కలిగిన 75 గంజాయి ప్యాకెట్లు లభించాయి. వీటితో పాటు సుమారు 4 లక్షల విలువైన రెండు కార్లు, నిందుతుల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వీటి విలువ సుమారు 22లక్షల50 వేలు ఉంటుందని పోలీసులు నిర్ణయించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రఘుపతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement