జనగాం జిల్లా ఉప్పుగల్లులో జరిగిన సంఘటన కేవలం ఇద్దరు త్రాగుబోతులతోనే గొడవ జరిగిందని జఫర్ ఘడ్ ఎస్ఐ బి.మాధవ్ గౌడ్ తెలిపారు.ఈ సంఘటన ఏ పార్టీలు, వ్యక్తులకు గానీ సంబంధం లేదన్నారు..సోమవారం ఎస్ఐ బి.మాధవ్ గౌడ్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి…జనగామ జిల్లా జఫర్ ఘడ్ మండలం ఉప్పుగల్ గ్రామానికి చెందిన కేషోజు భిక్షపతి అనే వ్యక్తికి రోడ్డు పక్కన డబ్బా దుకాణం ఉంది..ఆ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు..అదే గ్రామంలో వారి ఇంటి వెనుక ఉండే శ్రవణ్ అనే సింగరేణి ఉద్యోగిగా పనిచేస్తాడు..శ్రీరామనవమి సందర్బంగా సెలవు కావడంతో ఇంటికి వచ్చాడు..అదే గ్రామానికి చెందిన అతని బంధువులు యాట యాకయ్య, మధులను రాత్రి భోజనానికి పిలిచారు..భిక్షపతి డబ్బావద్దకు 10గంటల సమయంలో
వెళ్లి కావాలనే 500 రూపాయల నోటు ఇచ్చి, రూ.1వేయి విలువ గల వస్తువును కొనుగోలు చేసి మాట మాట పెంచుకున్నారు.. గొడవకు దారి తీసే వారి బంధువులయిన యాట మహేష్, అశోక్ లను పిలిపించుకొని 5గురు కలసి బిక్షపతి ఇంటి మీద దాడి చేసి, కుర్చీలు ధ్వసం చేసి ,ద్విచక్రవాహన్నాని కింద పడేశారు..వారి వస్తువులను మొత్తం ధ్వంసం చేయడమే కాకుండా డబ్బాను మొత్తం తీసి పక్కన పడేసారు..
-పాత గొడవే ఘటనకు కారణం..
శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలో సంఘటన జరిగిన సమయంలో అక్కడ చాలా మంది గుమిగూడారు..ఈ సంఘటన ఇద్దరు తాగుబోతుల వలనే జరిగింది..వారికి జనవరిలోనే గొడవలు జరిగాయి..అపుడు ఇరువురి మీద కేసులు అయ్యాయి.. అప్పటి గొడవను దృష్టిలో పెట్టుకొని రాత్రి గొడవ చేసుకున్నారని ఎస్ఐ.మాధవ్ గౌడ్ తెలిపారు..ఆ గొడవకు పార్టీలకు,భూ కబ్జాలకు సంబంధం ఉన్నట్లు సృష్టించారని, తాము విచారణ చేసాం. పార్టీలు, ,వ్యక్తులకు సంబంధం లేదని, ఇద్దరూ తాగుబోతుల వల్లనే గొడవ జరిగిందన్నారు..ఎవరికి పార్టీలకు సంబంధంలేదని, ఇతర వ్యక్తులకు ఎటువంటి సంబంధం లేదని పూర్తిగా విచారణ చేసి, ఘటనకు కారణమైన 5గురు పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు…
ఇద్దరు త్రాగుబోతులతోనే గొడవ..పార్టీలకు సంబంధం లేదు..
Advertisement
తాజా వార్తలు
Advertisement