Friday, September 6, 2024

TG: అడవిలో చిక్కుకున్న పోలీసు బలగాలు.. హెలికాప్టర్ ద్వారా తరలింపు

వాజేడు, జులై 21 ప్రభ న్యూస్ : అడ‌విలో చిక్కుకున్న పోలీసు బలగాలను హెలికాప్టర్ ద్వారా తరలించారు. గత వారం రోజుల క్రితం ములుగు జిల్లా వాజేడు మండలం సరిహద్దు ప్రాంతమైన ఛ‌త్తీస్ ఘ‌డ్ అడవుల్లోకి కూంబింగ్ నిమిత్తం వెళ్లిన పోలీసు బలగాలు ఎలిమిడి ఎన్ కౌంటర్ లో పాల్గొని తిరుగు ప్రయాణంలో వర్షాలు విపరీతంగా సంభవించడంతో వాజేడు మండల పరిధిలోని పెనుగోలు గుట్టల్లో చిక్కుకుపోయారు పోలీసులు.

నడవలేని స్థితిలో ఉండగా అది తెలుసుకున్న పోలీసు యంత్రాంగం హెలికాప్టర్ సహాయంతో వాజేడు మండలం మండపాక గ్రామానికి హుటాహుటిన తరలించి వైద్య చికిత్స నిర్వహిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement