వరంగల్ – బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ కేసులో నేటి తెల్లవారుఝామున అరెస్ట్ చేశారు.. ఈ కేసులోని ప్రధాన నిందితుడు ప్రశాంత్ తన వాట్స్ ప్ ద్వారా బండి సంజయ్ కు పంపడంతో అరెస్ట్ కు దారి తీసింది.. బండి సంజయ్ పై మొత్తం రెండు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు చేశారు.. అయనపై IPC 420, 120B, సెక్షన్ 5 ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ తో పాటు CrPC 154 ,157 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు.. కాగా,ఈ సెక్షన్ ల ప్రకారం నమోదైన కేసులలో మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్షర్హమైనవిగా ఉన్నాయి.. అయితే 420 సెక్షన్ నమోదు చేయడంతో బెయిల్ ను కోర్టు ద్వారా పొందాల్సి ఉంటుంది. సంజయ్ పై కరీంనగర్ 2 టౌన్, కమలాపూర్‌లో కేసులు నమోదయ్యాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement