Thursday, November 21, 2024

హిజాబ్ ధ‌రించి స్కూల్ వచ్చిన విద్యార్ధినికి అవ‌మానం .. ప్రిన్సిపాల్ తో స‌హా నలుగురిపై కేసు న‌మోదు..

హైదరాబాద్‌లోని ఓ స్కూల్ లో ఓ విద్యార్ధిని హిజాబ్ ధరించి స్కూల్‌కి వచ్చిందని, ఆమెను వెంటనే బయటకు పంపించేశారు. దీంతో.. ఆ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివ‌రాల‌లోకి వెళితే …హయత్ నగర్‌లో జీ హై స్కూల్ లో సామియా ఫాతిమా 10వ తరగతి చదువుతోంది. శనివారం ఈ విద్యార్ధిని హిజాబ్ ధరించి స్కూలుకి వెళ్లగా.. స్కూల్ యాజమాన్యం ఆమెని ఇంటికి పంపింది. ఇంటికి చేరుకున్న ఆ విద్యార్థిని జరిగిన విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలియజేయడంతో .. వాళ్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. కస్తూరి A1(క్లాస్ టీచర్), పూర్ణిమ A2 (ప్రిన్సిపాల్), మధు శ్రీ A3 (9th class కో ఆర్డినేటర్), కవిత A4 (10th క్లాస్ కో ఆర్డినేటర్)లపై కేసు నమోదైంది.

మరోవైపు ఈ ఘటనపై విద్యార్థిని సామియా ఫాతిమా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. హిజాబ్ వేసుకుని బ‌డికి వ‌స్తే బయటకు పంపడమనేది మానవ హక్కులను హరించడమేనని పేర్కొంది. సెక్యులరిజం అంటే.. అన్నీ మతాలకు స్వేచ్ఛను ఇవ్వడమని తెలిపింది. కానీ.. స్కూల్ యాజమాన్యం తనపట్ల ఇలా వ్యవహరించడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో కూడా ఒక జూనియర్ విద్యార్ధిని హిజాబ్‌ను బలవంతంగా లాగేశారని తెలిపింది. ఇప్పుడు తన పట్ల కూడా అలాగే చేయడంతో, తాను పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement