రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇటీవలే జరిగిన కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్ర రెడ్డిలను మట్టారెడ్డి చంపించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. మట్టారెడ్డి ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు. పది ఎకరాల భూ వివాదంలో ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తేల్చారు. సుపారీ కిల్లర్ నవీన్ కు మట్టారెడ్డి డబ్బులు చెల్లించినట్లు కనుగొన్నారు. సుపారీ గ్యాంగ్ తోనే శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్ర రెడ్డిని మట్టారెడ్డి చంపించారని పోలీసుల విచారణతో తేలింది. సాంకేతిక సాక్ష్యాలతో విచారణ తర్వాత మట్టారెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడు అని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో మట్టారెడ్డి, హఫీజ్, నవీన్ లన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసులో పాల్గొన్న మరికొందరి కోసం పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital