Thursday, November 21, 2024

Breaking : ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును ఛేదించిన పోలీసులు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇటీవ‌లే జరిగిన‌ కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్ర రెడ్డిలను మట్టారెడ్డి చంపించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. మట్టారెడ్డి ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు. పది ఎకరాల భూ వివాదంలో ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తేల్చారు. సుపారీ కిల్లర్ నవీన్ కు మట్టారెడ్డి డబ్బులు చెల్లించినట్లు కనుగొన్నారు. సుపారీ గ్యాంగ్ తోనే శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్ర రెడ్డిని మట్టారెడ్డి చంపించారని పోలీసుల విచారణతో తేలింది. సాంకేతిక సాక్ష్యాలతో విచారణ తర్వాత మట్టారెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడు అని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో మట్టారెడ్డి, హఫీజ్, నవీన్ లన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసులో పాల్గొన్న మరికొందరి కోసం పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement