Friday, November 22, 2024

పోలీసుల కార్డన్ సర్చ్.. ఎక్క‌డో తెలుసా..

రఘునాథపల్లి, (ప్రభన్యూస్): వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆదేశాలతో రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో ఆదివారం ఉదయం 6 గంటల నుండి సుమారు ఎనిమిది గంటల వరకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జనగామ వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడుతూ గ్రామంలో 2 బెల్టుషాపులు, సుమారుగా 29 మోటార్ సైకిల్లు, 1 ట్రాక్టర్, 1 ఆటోను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించామని అన్నారు.

గ్రామాలలో యువత గాంజాయి, గుట్కా లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అదేవిధంగా గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీసీ కెమెరాలు ఏర్పాటుకు గ్రామస్తులు పూర్తి స్థాయిలో సహకరించాలని అన్నారు.

ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అని ఏలాంటి సంఘటనలు జరిగినా కూడా సీసీ కెమెరాల ద్వారా ఆధారాలను సేకరించవచ్చని అన్నారు. ఈకార్యక్రమంలో స్టేషన్గన్పూర్ ఏసిపి రఘు చందర్, జనగామ రూరల్ సీఐ వి.వినయ్ కుమార్, స్థానిక ఎస్ఐ బి.రాజేష్ నాయక్, దేవేందర్, శ్రీనివాస్, తిరుపతి, పోలీస్ సిబ్బంది కనుక చంద్రం, వీరన్న, వెంకన్న, వేణు, భార్గవి, సమ్రీన్, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement