కొందరు కదులుతున్న రైళ్లు ఎక్కుతూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. కదులుతున్న రైలులో నుంచి ఎక్కే క్రమంలో బారి కింద పడిపోయిన మహిళను ఓ కానిస్టేబుల్ చాకచక్యంగా కాపాడారు. దీంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది.ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగింది.
సికింద్రాబాద్ రైల్వె స్టేషన్ నుంచి బయలు దేరుతున్న ఎమ్‌ఎమ్‌ఆర్ స్పెషల్ రైలు ఎక్కేందేకు నసిమా బేగం అనే మహిళ పరిగేత్తుకుంటూ వచ్చింది. అయితే అదే సమయంలో రైలు కదలడంతో పరుగున వెళ్ళి ఏక్కె ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఫుట్ బోర్డు నుంచి జారి పడిపోయింది. ప్లాట్ ఫామ్, రైలు మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దినేష్ సింగ్.. ఆమెను గట్టిగా పట్టుకోని ప్లాట్‌ఫాం మీదకు లాగేయండతో ప్రాణపాయం తప్పింది. రైలులో ఉన్న వారు చైన్ లాగడంతో రైళ్ళు ఐదు నిమిషాలు ఆలస్యంగా బయలు దేరింది. మహిళను ..క్షేమంగా తిరిగి రైలు ఎక్కించి పంపివేశారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. నసిమాను కాపాడిన కానిస్టేబుల్ పై ప్రశంసల జల్లు కురిపించారు ప్రయాణికులు, తోటి అధికారులు. సౌత్ సెంట్రల్ రైల్వే కూడా దినేష్ ను పొగుడుతూ ఓ ట్వీట్ చేసింది. కానిస్టేబుల్ సకాలంలో స్పందించాడని కొనియాడింది.