Thursday, December 12, 2024

Police Complaint – కొట్టుకున్న మంచు మోహన్ బాబు, మనోజ్

హైదరాబాద్ – మంచు ఫ్యామిలీలో గొడవలు తాజాగా కొట్టుకునే స్థాయికి చేరాయి . దీంతో తండ్రి, కొడుకు పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

.ఆస్తుల పంపకాల విషయంలో ఈ గొడవలు తలెత్తినట్లు సమాచారం . మంచు మనోజ్, మోహన్ బాబు గొడవపడి హైదరాబాద్ లోని ఫహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో నేడు ఒకరికపై ఒకరు పోలీసులకి పరస్పర ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంచు మనోజ్ తనపై అలాగే తన భార్య మౌనిక రెడ్డిపై మోహన్ బాబు దాడి చేసినట్లు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నాడు

ముందుగా నటుడు మోహన్ బాబుపై కొడుకు మంచు మనోజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తండ్రి తనను కొట్టాడని మనోజ్ ఫిర్యాదు చేయగా.. మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై మంచు మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో ఆస్ధి తగాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా మోహన్ బాబుకి సంబంధించిన విద్యానికేతన్ విద్యాసంస్థలతోపాటూ, ఇతర ఆస్తుల పంపకాల విషయంలో అవకతవకలు జరిగాయని దీంతో మంచు మనోజ్ తన ఫ్యామిలీ దూరంగా ఉంటున్నాడని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.ఈ విషయం ఇలా ఉండగా ఐతే గతంలో కూడా మంచు విష్ణు… మనోజ్ ఇంటికెళ్లి గొడవ పడినట్లు పలు వీడియోలు బయటికొచ్చాయి. ఈ వీడియోలలో మనోజ్ మాట్లాడుతూ తనకి కావాల్సిన వ్యక్తులపై విష్ణు తన అనుచరులతో వచ్చి దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేశాడు. కానీ ఆ సమయంలో మంచు విష్ణు స్పందిస్తూ తమ ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేవని వివరణ ఇచ్చాడు.

- Advertisement -

.

Advertisement

తాజా వార్తలు

Advertisement