Home తెలంగాణ‌ MDK | మృతుల కుటుంబాలను పరామర్శించిన సీపీ అనురాధ

MDK | మృతుల కుటుంబాలను పరామర్శించిన సీపీ అనురాధ

0
MDK | మృతుల కుటుంబాలను పరామర్శించిన సీపీ అనురాధ

గజ్వేల్, డిసెంబర్ 8 (ఆంధ్రప్రభ) : గజ్వేల్ పట్టణంలో ఇవాళ‌ తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు పరంధాములు గౌడ్, వెంకటేష్ లు మృతిచెందగా, వారి మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ హుటాహుటిన గజ్వేల్ కు చేరుకొని మృతదేహాలు పరిశీలించి, నివాళులర్పించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను స్థానిక ఇన్ స్పెక్ట‌ర్ సైదాను అడిగి తెలుసుకున్నారు. అలాగే పోలీస్ కమిషనర్ ఇరువురి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Exit mobile version