మెదక్ జిల్లాలో అర్ధరాత్రి భారీగా నగదును తరలించే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా చందాయి పేట్ రోడ్డు మార్గంలో వస్తున్న కారును పోలీసులు తనిఖి చేశారు. అందులో 88 లక్షలకు పైగా నగదు బయట పడింది.
- Advertisement -
మాసాయిపేట మండలం పరిధిలోకి చందాయి పేట్ రోడ్డు మార్గంలో వెళ్తున్న సమయంలో ధనలక్ష్మి రైస్ మిల్ దగ్గర తూప్రాన్ డిఎస్పి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేపట్టడం జరిగిందని రామయంపేట సిఐ, చేగుంట ఎస్సైలు తెలిపారు. ఈ సమయంలో అటుగా వస్తున్న కారును తనిఖి చేశామని, కారులో భారీగా నగదు లభ్యమైందని తెలిపారు. 88 లక్షల చిల్లర నగదు పట్టుబడినట్లు తెలిపారు.