Tuesday, November 26, 2024

Agriculture University: విద్యార్థుల పై పోలీసుల దాష్టికం…యువతి జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన ఖాకీలు

వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను తెలంగాణ హైకోర్టుకు కేటాయించవద్దని నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై పోలీసులు క‌ర్ష‌కంగా ప్ర‌వ‌ర్తించారు. జీవో నెంబర్ 55ను గవర్నమెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాలని శాంతియుతంగా నిరసన చేసిన ఏబీవీపీ నాయకురాలిని లేడీ కానిస్టేబుల్స్ స్కూటీపై వెళ్తూ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు.

దీంతో ఆ యువతి ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ ఘటనపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్​
మహిళ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్​ అయ్యారు. ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ‘ఎక్స్‌’ ద్వారా డిమాండ్‌ చేశారు. ‘తెలంగాణ పోలీసులకు సంబంధించిన తాజా సంఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థినిపై పోలీసుల దాడి అమానుషం. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. నిరసన చేపడుతున్న విద్యార్థినిని ఈడ్చుకెళ్లడం, నిరసనకారులపై అసభ్యంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు. ఈ దురహంకార ప్రవర్తనకు తెలంగాణ పోలీసులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. మానవ హక్కుల సంఘం ఈ సంఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ దారుణ సంఘటనను అందరూ ముక్తకంఠంతో ఖండించాలి’ అని కవిత పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement