హైదరాబాద్ వాటర్ బోర్డు పర్మిషన్ లేకుండానే నల్లా కనెక్షన్ పెట్టుకుని అక్రమంగా నీటిని వాడుకుంటున్న వారిని అధికారులు గుర్తించారు. చింత్లోని భగత్‌సింగ్ నగర్‌లోని వాటర్‌బోర్డు పైపులైన్ల నుంచి నీటి కనెక్షన్లను పెట్టుకున్నారు. అక్రమ నీటి కనెక్షన్లపై వాటర్ బోర్డు సీరియస్‌గా ఫోకస్ పెడుతోంది. ఈ క్రమంలో జరిపిన తనిఖీల్లో ఆరుగురిని గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు.
అక్రమంగా నీటి కెన్షన్ తీసుకుని నీటిని వాడుతున్న వారిపై జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో సెక్షన్ 269, 430, కింద కేసు నమోదు చేశారు. నీటిపారుదల పనులను దెబ్బతీయడం, నీటిని తప్పుగా మళ్లించడం వంటి పనులు చేసిన దానికి వారిపై చర్యలు తీసుకోనున్నట్టు వాటర్ బోర్డు అధికారులు తెలిపారు.