రామగుండం పోలీసులు ఘరాన దొంగలను పట్టుకున్నారు. ఎవరు లేని ప్రాంతంలో పార్క్ చేసిన లారీలను మాయం చేసి గంట వ్యవధిలో దాని రూపురేఖలు మార్చి ఆనవాళ్లు సైతం లేకుండా చేసే ఘరానా దొంగల ముఠాను సుల్తానాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రామగుండం పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు -చేసిన మీడియా సమావేశంలో లారీల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా వివరాలను వెల్లడించారు. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన మాదరవేని కుమార్ యాదవ్ జీవనోపాధి కోసం లారీ నడుపుకుంటాడన్నాడు. ఈనెల 18వ తేదీన సుల్తానాబాద్ చెరువు రోడ్డులో ఇంటి ముందు తన లారీని పార్క్ చేసి ఇంటిలోకి వెళ్లాడన్నారు. మరుసటి రోజు ఉదయం కిరాయి కోసం లారీని తీసేందుకు వెళ్లగా తాను పార్క్ చేసిన స్థలంలో లారీ కనపడలేదు. డ్రైవర్ ఏమైనా లారీని తీశాడేమోనని అనుమానంతో చుట్టు-పక్కల చూసినా లారీ ఆచూకీ దొరకలేదన్నారు. దీంతో కంగారు పడి డ్రైవర్‌ను సంప్రదించి లారీ జాడ తెలుసుకునే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోవడంతో చివరికి లారీ దొంగతనం జరిగిందని తెలిసి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి ప్రత్యేక టీంలను ఏర్పాటు ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో లారీ దొంగలను పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను పట్టుకున్నారన్నారు. మిగతా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులను సీపీ అభినందించారు.