హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో సినీనటి షాలూ చౌరాసియాపై దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నటిపై దాడికి పాల్పడిన నిందితుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 14న సాయంత్రం వేళ వాకింగ్ కోసం చౌరాసియా కేబీఆర్ పార్కుకి వెళ్లారు. ఈ క్రమంలో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో దుండగుడు నటి చౌరాసియాపై దాడికి పాల్పడి సెల్‌ఫోన్ లాక్కెళ్లాడు.
ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే సీసీ కెమెరా ఫుటేజిలో ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు శాస్త్రీయ పంథాలో ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమలో లైట్‌బాయ్‌గా పనిచేస్తూ కృష్ణనగర్‌లో నివసిస్తున్న బాబు అనే వ్యక్తిని ప్రధాన అనుమానితుడిగా గుర్తించారు. శుక్రవారం కృష్ణనగర్‌లో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుడి నుంచి చౌరాసియాకు చెందిన ఫోన్‌ను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital