జైనూర్ జూలై 3 (ప్రభన్యూస్) ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీం ఆనాడు జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేయగా తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భీమాశయాల నెరవేరుస్తున్నారని జెడ్పి చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు సోమవారం కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ప్రభుత్వం మంజూరు చేసిన పోడు భూముల పట్టాలను గిరిజన రైతులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజల్ల సంక్షేమ కోసం ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆదివాసి పండుగలకు ప్రధాన్యత ఇవ్వడంతో పాటు జోడిగట్లో 25 కోట్లతో మ్యూజియం ఏర్పాటు చేశారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా గిరిజనులు కోడు పట్టాల కోసం పోరాటం చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు పట్టాలు ఇవ్వడం గర్వనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్ రావు,ఎంపీపీ కుమ్ర తిరుమల విశ్వనాథ్ ,వైస్ ఎంపీపీ లక్ష్మణ్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇంతియాజులాల, సహకార చైర్మన్ కోడప హను పటేల్, స్థానిక సర్పంచ్ మెస్రం పార్వతి లక్ష్మణ్ ,ఎంపీడీవో ప్రభుదయ, ఈవో శ్రీనివాస్ రెడ్డి సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.