బాన్సువాడ, మే 17 ప్రభ న్యూస్ మైసమ్మ ఆలయానికి మౌలిక వసతుల కోసం కృషి చేస్తామని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు నసుల్లాబాద్ మండలంలోని కొచ్చిర్ మైసమ్మ ఆలయ సమీపంలో కోసం నూతన కాటేజ నిర్మాణం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం గిరిజన గురుకుల పాఠశాలలో నూతనంగా నిర్వహించే విద్యార్థుల డార్మెంటరీ స్థలాన్ని పరిశీలించారు. భక్తులకు అవసరమైన ఇప్పటికే 1.35 కోట్లతో మెయిన్ రోడ్డు నుండి లింగంపల్లి తాండ వరకు తారు రోడ్డు ఆలయం వద్ద నలభై లక్షలతో సిసి రోడ్లు వేయడానికి నిధులు కూడా మంజూరు అయ్యాయని కాటేజీల నిర్మాణానికి ఈరోజు స్థలాన్ని పరిశీలించారు.1.50 కోట్లతో కాటేజీల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేమని ఆయన అన్నారు. నిద్ర మంజూరు కాగానే వెంటనే పనులు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా నసుల్లాబాద్ గిరిజన గురుకులం బాలల పాఠశాలలో అదనంగా మరో దారిమెంటరీ నిర్మాణం మరియు 8 ఉపాధ్యాయుల క్వార్టర్స్ నిర్మాణానికి 12 కోట్లు మంజూరు మంజూరయ్యాయని ఆయన అన్నారు. ఇప్పటికే టెండర్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభించి త్వఈగా పూర్తిచేసి విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. హనుమాజీపేట కోనాపూర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేయడానికి గిరిజన బాలికల గురుకుల పాఠశాల మంజూరు అయిందని ఈ ఏడాది నుండి తరగతులు ప్రారంభిస్తామని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని నూతన మండల కేంద్రాలు లో ఒక్కొక్కటి మండలానికి కోటి రూపాయలతో మండల కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని ఆయన అన్నారు.