Tuesday, November 26, 2024

అధికారుల నిర్లక్ష్యంపై శాసన సభాపతి పోచారం ఆగ్రహం

నసురుల్లాబాద్ మే 2 ప్రభ న్యూస్: నసుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్ గ్రామంలో అధికారులు నిర్లక్ష్యం తేటతలైంది. సోమవారం నాడు లోని గంగమ్మ గుడి ప్రారంభోత్సవానికి వస్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మార్గమధ్యలో రైతులను పరామర్శించారు. దీంతో రోడ్డుపై దాన్యాన్ని ఆరబోసుకున్న నసురుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్ గ్రామ రైతులు తమ బాధను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో వ్యక్తం చేశారు.

ఇటీవల కురుస్తున్నటువంటి వడగండ్ల వాన ప్రభావంతో వడ్లను ఆరబెట్టడం, వడ్లు మొలక రావడం పలు సమస్యలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మిర్జాపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీలో రైతుల తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. స్పీకర్ గ్రామంలో పర్యటిస్తున్నప్పటికీ మండల అధికారులు లేకపోవడం, వ్యవసాయ రైతులకు ఉన్నప్పటికీ, రైతుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అగ్రికల్చర్ ఆఫీసర్లు అందుబాటు లేకపోవడంతో, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగాన్ని రైతుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వీరాపుర్ గ్రామంలోనీ దుబ్బ ప్రాంతాన్ని పర్యటించారు.

ఈ సందర్భంగా ఈ ప్రాంతంలోని డబుల్ బెడ్ రూమ్ లను, సిసి రోడ్లను, డ్రైనేజ్ కాలువలు వంటి అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం వీరాపూర్ దుబ్బా గ్రామంలో తోట పర్వయ్య మందిరాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆదేశాలతో ఏ.డి. ఏ.వో., ఏ.సి.ఓ., డీ.ఎస్.ఓ. పద్మ, డి.ఏ.ఓ.వీరస్వామి, డి ఎం అభిషేక్ వీరాపూర్, మిర్జాపూర్ గ్రామాలకు చేరుకొని, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి వివరణ ఇచ్చారు. రైతుల ధాన్యాన్ని కొనుగోలు వేగవంతం చేశారు.స్పీకర్ ఆదేశాలతో కలెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మరంగా వరి ధాన్యం కొనుగోలుస్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మిర్జాపూర్, వీరాపూర్ గ్రామానికి చేరుకున్నటువంటి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ గ్రామాల్లో పర్యటించి రైతుల వద్దకు చేరుకొని వారి ధాన్యాన్ని మ్యాచర్ వేసి మ్యాచర్ వచ్చినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయించారు.

దీంతో రైతులంతా హర్షం వ్యక్తం చేశారు.ఏ.ఈ.ఓ.& ఏ.డి. పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన శాసన సభాపతి నసురుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్ గ్రామంలోనీ గ్రామ ప్రజలు, రైతులు ఏ.ఈ.ఓ. భాను ఏ.డి. పనితీరును సభాపతి దృష్టికి తీసుకెళ్లగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఏ.ఈ.ఓ. భాను గ్రామాలలో పర్యటించడం లేదని, రైతులతో సమీక్ష నిర్వహించలేదని, చుట్టం చూపు లాగా కనబడి వెళ్తాడని రైతులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల 8 నెలల క్రితం చనిపోయినటువంటి మిర్జాపూర్ గ్రామానికి చెందిన సాయిలు రైతు భీమా రాలేదని సభాపతి దృష్టికి తీసుకెళ్లగా, ఈ విషయంపై ప్రజల సమక్షంలోనే ఏ.ఈ.ఓ. భాను ఏ.డి.ఏ. వినయ్ కుమార్, ఏ.వో. నరేంద్ర ను ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్పడంతో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజల రైతుల సమస్యలను పరిష్కరించినప్పుడు మీరు ఉద్యోగంలో ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. రైతులతో సమావేశం ఏర్పాటు చేయడానికి, రైతు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడానికి రైతు వేదికను ఏర్పాటు చేయమని అలాంటి రైతు వేదికను ఎలా మూసి ఉంచుతారని అగ్రికల్చర్ ఆఫీసర్లను ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement