నేడు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటించానున్నారు. ఆదిలాబాద్ లో ఎన్నికల శంఖారావం పూరించేందుకు ప్రధాని మోడీ… తెలంగాణకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రధాని మోడీ బహిరంగ సభ ఉండబోతుంది. అక్కడే పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ప్రధాని మోడీ.
అధికారిక కార్యక్రమాల్లో సిఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళ సై పాల్గొననున్నారు. అటు ప్రధాని మోడీకి సిఎం రేవంత్, గవర్నర్ ఆహ్వానం పలకనున్నారు. ఈ నేపథ్యంలోనే… తెలుగులో ట్వీట్ చేశారు ప్రధాని మోడీ. నేడు… ఫిబ్రవరి 4వ తేదీన తెలంగాణ ప్రజల మధ్య గడిపేందుకు నేను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానన్నారు ప్రధాని మోడీ.
ఆదిలాబాద్లో జరిగే కార్యక్రమంలో రూ.56,000 కోట్ల విలువగల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలని, శంకుస్థాపనలను చేస్తానని వివరించారు.ఆ తర్వాత తెలంగాణ బీజేపీ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తాను. రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతివ్వబోతోందని వెల్లడించారు ప్రధాని మోడీ.
ప్రధాని మోడీ షెడ్యూల్
ఉదయం ఆదిలాబాద్ కు చేరుకోనున్నారు ప్రధాని మోడీ. అనంతరం అక్కడి నుంచి స్టేడియంకు వస్తారు. అక్కడ అధికారిక కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం అక్కడి నుంచి నేరుగా బహిరంగలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు