Sunday, November 3, 2024

TS: ప్లాస్టిక్ రహితమే ప్రాణపదం… జడ్జి సునీత కుంచాల

నిజామాబాద్, ఫిబ్రవరి 20 (ప్రభ న్యూస్): పర్యావరణ పరిరక్షణకు, మానవ మనుగడకు ప్లాస్టిక్ రహితమే ప్రాణపదమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బాస రాజేశ్వర్ వారి తల్లిదండ్రులు బాస పోశెట్టి లక్ష్మీబాయిల స్మృతార్థం కాటన్ క్లాత్ తో రూపొందించిన హ్యాండ్ బ్యాగులను మంగళవారం జిల్లాకోర్టులోని తన చాంబర్ లో సీనియర్ న్యాయవాదులు మంథని రాజేందర్ రెడ్డి, ఆకుల రమేష్,నీలకంట రావు, గొర్రెపాటి మాధవరావు, శ్రీహరి ఆచార్య, కుమార్ దాస్, జె.వెంకటేశ్వర్, వి.భాస్కర్,మానిక్ రాజ్, ఆశ నారాయణ లతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… తాగే నీటి నుండి మొదలు తినే ఆహారం వరకు ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించి బట్టలతో తయారు చేసిన వాటిని ఉపయోగించాలన్నారు. ప్లాస్టిక్ వస్తువులు వాడటం వలన అనేక అనారోగ్య సమస్యలు మనుషులను చుట్టుముడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. గత కాలపు తరం బట్టలతో చేసిన వాటి ఉపయోగించి ఆరోగ్యంగా జీవించారని, వారే నేటి తరానికి ఆదర్శం కావాలని ఆమె అన్నారు. ప్రతి పౌరుడు తన తల్లిదండ్రుల పేరున క్లాత్ తో తయారు చేసిన బ్యాగులను, ఇతరత్రా చిన్నచిన్న బ్యాగులను ప్రజలకు పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణకు కారకులు కావాలని ఆమె ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement