Tuesday, November 26, 2024

Breaking | పర్యావరణ రక్షణకు మొక్కలు నాటాలి.. అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పెద్దపెల్లి అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ పిలుపునిచ్చారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ రోజురోజుకు పర్యావరణం కలుషితమవుతుందని, దాని నియంత్రణ మొక్కల పెంపకం ద్వారానే సాధ్యమవుతుందన్నారు.

ప్రతి ఒక్కరూ విధిగా ఐదు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement