Friday, November 22, 2024

వ‌రికి బ‌దులు ప్ర‌త్యామ్నాయ పంట‌లు వేసుకోండి : ఎంపీ రంజిత్ రెడ్డి

రైతులు వ‌రికి బ‌దులు ప్ర‌త్యామ్నాయ పంట‌లు వేసుకోవాల‌ని, వ‌రి సాగు చేసి న‌ష్ట‌పోవ‌ద్ద‌ని, అందుకు రైతుల‌ను చైత‌న్యం చేసే బాధ్య‌త‌ను రైతు బంధు స‌మితి ప్ర‌తినిధులు, అధికారులు తీసుకోవాల‌ని చేవెళ్ల లోక్ స‌భ స‌భ్యులు డా.జి.రంజిత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమితి సభ్యులు, జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ పంటల సాగు అవగాహన సమీక్ష సమావేశం లో కలెక్టర్ నిఖిల, స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ లతో కలిసి రంజిత్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పై వివక్ష చూపుతుందన్నారు. అందులో భాగంగానే మన రాష్ట్రానికి సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదన్నారు. ఈ కారణంగానే రైతులను వరి వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నామ‌న్నారు. రైతులకు నష్టం రావొద్దనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్, మన ప్రభుత్వం ఆలోచించి వరి వేయొద్దని కోరుతున్నామన్నారు. ఈ సందర్భంగా రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటలలో పామాయిల్ వంటి పంటలను వేసే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వికారాబాద్ జిల్లాలో వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, రైతు బంధు సమితి సభ్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement