ప్రభన్యూస్: వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆర్థిక, సామాజిక అంశాలపై పరిశోధనలు చేసే విద్యార్థులకు ప్రణాళికాశాఖ ప్రచురణలు కరదీపిక మాదిరిగా ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్ అన్నారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో కాకతీయ యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్స్ డాక్టర్ బి.వీరేందర్, డాక్టర్ మేడారం సుధాకర్‌కు ప్రణాళికాశాఖ ప్రచురణలను వినోద్ కుమార్ బహుకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సీఎం సూక్ష్మ పరిశీలన, లోతైన విశ్లేషణలతో రూపొం దిస్తున్న పథకాలు వంటి అనేక అంశాలు, గణాంకాలతో ప్రచురణలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కేవలం స్కాలర్స్‌కే కాకుండా వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కూడా ఈ ప్రచురణలు దిక్సూచిగా ఉంటాయని వెల్లడించారు. ప్రణాళికా శాఖ ప్రచురణలను ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లాపరిషత్ ఛైర్మన్లు, లైబ్రరీలకు అందజేసినట్లు ఆయన తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital