Saturday, November 23, 2024

Plan ‘B’ – విప‌క్ష స్థానాల‌పై బిఆర్ఎస్ గురి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అంసెబ్లి ఎన్నికల్లో భారాస గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పావులు కదుపుతోంది. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది. ప్రతిపక్షాలు బలంగా ఉన్న స్థానాలు, బలపడే అవకాశం ఉన్న స్థానాలు, సిట్టింగ్‌ స్థానాల్లో చేయాల్సిన మార్పులు, చేర్పులపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. ఎత్తులు, పైఎత్తులతో విపక్షాల అభ్యర్థులు చిత్తు చిత్తుగా ఓడిపోయేలా వ్యూహాలను రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని స్థానాల్లో ప్రధాన మార్పులను చేయాలని పార్టీ అధిష్టానం డిసైడ్‌ అయ్యింది. ప్రస్తుత పరిస్థితులు, ఎన్నికల ముందు ఉండే ఎలక్షన్‌ మూడ్‌ లాంటి వాటిని అంచనా వేస్తూ ముందస్తు నిర్ణయాలను తీసుకొంటోంది.


రాష్ట్రంలో గెలిచి, అభివృద్ధికి అడ్డుపడుతూ, ఇబ్బందులు తెస్తారనుకుంటున్న ప్రతిపక్షాల లీడర్లపై నజర్‌ పెట్టింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచిన వారు రాష్ట్ర ప్రగతికి అడ్డు తగులు తున్నారని ఇప్పటికే పలు సార్లు అధినేత ధ్వజ మెత్తారు. అలాంటి వారిని అసెంబ్లిdలో అడుగు పెట్టనిచ్చేదే లేదు అన్న కృత నిచ్చయంతో బలమైన వ్యక్తులను పార్టీ నుంచి బరిలోకి దించాలని డిసైడ్‌ అయినట్లుగా సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మార్పులు చేర్పులు చేయాలన్న చర్చ సాగినట్లుగా గులాబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.


ఉమ్మడి కరీంనగర్‌లో ప్రతిపక్షాలకు అవకాశమే ఇవ్వకూడదని గులాబీ అధిష్టానం డిసైడ్‌ అయ్యింది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లు చేస్తూ వస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ సైతం పలు సభల్లో పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఎమ్మెల్యేలు ఉంటున్నారు. జిల్లాలో రెండు స్థానాల్లో బీజేపీ పట్టుకోసం ప్రయత్నిస్తున్నట్లుగా భారాస భావిస్తోంది. ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్‌ నుంచి పోటీ చేస్తే మళ్లిd మంత్రి గంగుల కమలాకర్‌ భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఆ స్థానం ముమ్మాటికి భారాసనే గెలు స్తుందన్న ధీమాతో అధిష్టానం ఉంది. ఒక వేళ ఇక్కడి నుంచి కాకుండా వేములవాడ నుంచి బరిలోకి దిగితే ఏం చేద్దాం అనే ఆలోచనను కూడా చేసినట్లు సమాచారం. వేములవాడ నుంచి చెన్నమనేని రమేష్‌ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అతనిపై పౌరసత్వం విషయంలో ప్రతి సారి రాద్ధాంతం నడుస్తూ వస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. దీంతో అతన్ని తప్పించి ఇక్కడి నుంచి మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ను బరిలోకి దించుదామన్న ఆలోచనలను చేస్తోంది.


ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిని సైతం చూపిస్తున్నారు. గతంలో పలు సార్లు అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు అధిష్టానం వినోద్‌ కుమార్‌ను అసెంబ్లిd ఎన్నికల్లో పోటీ చేయించి సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇద్దామన్న ఆలోచనను కూడా చేసినట్లుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement