Sunday, November 10, 2024

Pipri Tour – పాదయాత్ర దీవెనతోనే ప్రజా పాలన – డిప్యూటీ సీఎం భ‌ట్టి

పిప్రి గ్రామ‌స్తుల‌కు కృత‌జ్ఞ‌త‌లు
ఇందిరమ్మ రాజ్యం ఆకాంక్షను నెరవేరుస్తాం
తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టును పునరుద్ధ‌రిస్తాం

ఆంధ్రప్రభ స్మార్ట్, ఉమ్మడి అదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామం నుంచి ప్రారంభమైన మహా పాదయాత్రలో ప్రజా సమస్యలు తట్టి లేపాయని, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇందిరమ్మ రాజ్యం కల నెరవేరుతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గత ఏడాది మార్చి 16న ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తొలి గ్రామం పిప్రిలో బుధ‌వారం ఏర్పాటు చేసిన‌ బహిరంగ సభలో ఆయ‌న‌ ప్రసంగించారు. ఆదివాసుల కష్టాలు, పేద ప్రజల సమస్యలు పాదయాత్రలో తమ గుండెను తాకాయని, ప్రజల ఆకాంక్షలు క్రమంగా నెరవేరుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఆదిలాబాద్ జిల్లా పాదయాత్ర నాంది పలికిందని చెప్పారు.

- Advertisement -

సాగునీటి ప్రాజెక్టుల సాకారం
ఆదిలాబాద్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, నాలుగు నెలల్లో తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టును పునరుద్ధ‌రిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. కుట్టి ప్రాజెక్టుతో పాటు చనాక కొర్ట ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించామని, చిక్మాన్ సాధర్మాట్ ప్రాజెక్టులను కూడా సత్వరమే పూర్తి చేస్తామన్నారు.

ప్ర‌జాస‌మ‌స్య‌లు త‌ట్టిలేపిన పాద‌యాత్ర‌
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మం వరకు విజయవంతమైందని భ‌ట్టి అన్నారు. వెయ్యి గ్రామాలు, 1600 కిలోమీటర్ల పొడవునా పాదయాత్ర నిర్వ‌హించామ‌ని గుర్తు చేశారు. ఈ పాద‌యాత్ర‌లో అన్ని వర్గాల ప్రజల సమస్యలు తట్టి లేపాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వెడమ బొజ్జు, అనిల్ జా దవ్, ప్రేమ్ సాగర్ రావు, మధు యాష్ కి గౌడ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement