మెదక్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జయభేరి మోగిస్తోంది. ఇప్పటికే నల్గొండ, ఖమ్మంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ఇదే క్రమంలో మెదక్‌లో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి యాదవరెడ్డికి 762 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థికి 238 ఓట్లే పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థికి కేవలం ఆరు ఓట్లే వచ్చాయి. మెదక్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 12 ఓట్లు చెల్లనివిగా తేలాయి. దీంతో మెదక్ లో స్థానిక సంస్థల నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 524 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 1018 ఓట్లకు గాను కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలకు 238, టీఆర్ఎస్ అభ్యర్థి యాదవ్ రెడ్డికి 762, స్వతంత్ర అభ్యర్థి మల్లారెడ్డికి 6 ఓట్లు రాగా 12 ఓట్లు చెల్లుబాటు కాలేవు. దీంతో 524 ఓట్ల మెజారిటీతో ఒంటెరి యాదవ్ రెడ్డి గెలుపొందారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital