హైదరాబాద్ – మహిళల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం గచ్చిబౌలి స్టేడియంలో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహనా కల్పించేందుకు ఏర్పాటు చేసిన ‘పింక్ పవర్ రన్-2024’కార్యక్రమానికి సీఎం రేవంత్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు
అనంతరం బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనా రన్‌లో గెలిచిన పలువురికి అవార్డులను అందజేశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం, సమాజం సంతోషంగా ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం కూడా అదే నమ్ముతున్నదని చెప్పారు.
ఉమెన్ హెల్త్ కేర్‌ను మెరుగుపరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వైద్య రంగ అభివృద్ధికి పెద్దపీఠ వేస్తున్నామన్నారు. మహిళల ఆరోగ్యం కోసం మరిన్ని ఆసుపత్రులు నిర్మిస్తున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో మహిళల సాధికారత కోసం మనమంతా కలిసి కట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.