తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. నలుగురు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ ఆధారంగా ఉమ్మడి నల్గొండ మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది.
కాగా, నిన్న నకిరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అదే పార్టీకి చెందిన మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రాష్ట్రానికి రప్పించి విచారణ జరపాలన్న పోలీసుల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు అమెరికాలో గ్రీన్ కార్డు రావడంతో తెలంగాణకు రప్పించి విచారణ జరిపే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు.
- Advertisement -